Sunday, May 5, 2024

 Srileela : సింపుల్ గా శ్రీలీల ..

డ్యాన్సింగ్ స్టైల్‌తో ప్ర‌త్యేకించి అభిమానుల‌ను సంపాదించుకుంది శ్రీ‌లీల‌. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాటతో మ‌రింత‌గా మాస్ లో క‌నెక్ట‌యింది ఈ బ్యూటీ. ధమాకా, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్రీలీల తన ప్రతిభతో అభిమానులను ఆకర్షించింది. శ్రీ‌లీల‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

- Advertisement -

తాజాగా ఈ బ్యూటీ బెంగళూరు నుండి ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభోత్సవంలో కనిపించింది. ఇది హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్‌లో మూడవ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. మహిళలకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కల్పిస్తూ ఈ ఫ్యాషన్‌ఫార్వర్డ్ బ్రాండ్ ప్రారంభోత్సవం శ్రీలీల చేతుల మీదుగా జరిగింది. స్టోర్ లాంచ్ లో శ్రీ‌లీల‌ స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది.

నిజానికి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీని డామినేట్ చేస్తూ ఎంద‌రో యువతుల‌కు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన శ్రీలీల ఎప్పుడూ స్టైల్ స్టేట్‌మెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంది. తాజాగా తాను ఎంపిక చేసుకున్న దుస్తులు సౌక‌ర్యం కోసం ప్రాధాన్య‌త‌.. అని శ్రీ‌లీల చెప్పింది. ఈ కొత్త లుక్ లో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తున్న ఈ బ్యూటీ.. డిజైన‌ర్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement