Sunday, April 28, 2024

Samantha : స‌మంత గ్లామ‌ర్ ట్రీట్ …

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయిన విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన తర్వాత మూవీలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. సమంత మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యేప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్లే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.సమంత ప్రస్తుతం హిందీలో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ఇది స్ట్రీమింగ్‌ కాబోతుంది.ఈ సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. అయితే తాజాగా అమెజాన్‌ప్రైమ్‌ తన సినిమాలను ప్రకటిస్తూ పెద్ద ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో సమంత పాల్గొంది. నయా పోజులతో ఆకట్టుకుంది. తన గ్లామర్‌ ట్రీట్‌తో నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. సమంత 2.0 ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement