Saturday, December 7, 2024

Meenakshi Chaudhary: చీర‌లో మీనాక్షి మురిపెం..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. రెండో సినిమాలో రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

- Advertisement -

ఇక మాస్ మాహారాజాతో కలిసి ధమాకాలో నటించి తన గ్లామర్ షోతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అడివి శేష్ తో కలిసి హిట్-2లో యాక్ట్ చేసి అదరగొట్టేసింది. లిప్ లాక్ సీన్లలో ఓ రేంజ్ లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబుతో నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు స్టార్ కథానాయకుల సరసన యాక్ట్ చేస్తూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.


ఇదంతా పక్కన పెడితే.. మీనాక్షీ చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటోంది. తాజాగా సింపుల్ ప్లెయిన్ కాటన్ శారీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది మీనాక్షీ చౌదరి. సూర్యాస్తమయం, ఒక మంచి బుక్, ఒక కప్పు చాయ్.. వన్ అండ్ ఓన్లీ సూపర్ కాంబో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement