Monday, May 6, 2024

Kiara : కియారా అద్వానీ జిగేల్…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. అటు హిందీ ఇటు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తూ గుర్తింపు సంపాదించుకుంటుంది. ఆమె రెమ్యూనరేషన్ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. తన అప్ కమింగ్ మూవీ కోసం కియారా రూ.13 కోట్లు అందుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే ఈ బ్యూటీ కొన్ని నెలల క్రితమే తన ప్రియుడు, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. ఇక వివాహం అయిన తర్వాత ఈ బ్యూటీ అసలు ఖాళీ లేదు. వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ షూటింగ్స్ లో బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం ఈ ముంబయి అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న కియారా.. బాలీవుడ్ లో వార్ 2, డాన్ 3 మూవీల్లో నటిస్తోంది.

- Advertisement -

ఇక డాన్ 3 సినిమా కోసం స్పెషల్ స్టంట్స్ కూడా నేర్చుకుంది. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను విడిచిపెట్టడం లేదు ఈ అమ్మడు. తన ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడే గ్లామర్ ట్రీట్ ఇస్తుంటోంది. తన పర్సనల్ విషయాలతోపాటు సినిమా కహానీలు షేర్ చేసుకుంటూ పోస్టులు పెడుతోంది. గ్లామరస్ లుక్స్ ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. స్కిన్ టైట్ డ్రెస్సులతోపాటు పొట్టి ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో కియారా పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో కియారా దిగిన పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండీతోపాటు షార్ట్ డ్రెస్సులో కియారా గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. పెళ్లి అయ్యాక.. గ్లామర్ ఇంకాస్త పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బ్లాక్ ఔట్ ఫిట్స్ లో గేమ్ ఛేంజర్ బ్యూటీ పిక్స్.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement