Saturday, May 4, 2024

Ruhi Singh : అన్నీ ఉన్నా…అదృష్ట‌మే లేదు…

మంచు విష్ణు కు జోడీగా మోసగాళ్లు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రూహి సింగ్ మొదటి సినిమా నిరాశపరచడంతో ఆ తర్వాత ఆఫర్లు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి హడావుడి సౌత్‌ లో కూడా ఉంటుంది.

బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. అయినా కూడా ఈ అమ్మడు నిరుత్సాహం వ్యక్తం చేయకుండా వరుసగా సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలు పోస్ట్‌ చేస్తూ వస్తుం తాజాగా మరోసారి అందమైన ఫోటోలను షేర్‌ చేసి ఆకట్టుకుంది. అందాల ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంత అందం ఉన్నా కూడా పాపం అదృష్టం కలిసి రాక పోవడంతో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

పొట్టి డ్రెస్ లో అందాల సునామి అంటూ ఈ ఫోటోలకు కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ అమ్మడికి తెలుగు లో మరో ఛాన్స్ వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి అయితే వరుసగా వెబ్‌ సిరీస్ ల్లో నటిస్తోంది. అంతే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement