Thursday, May 16, 2024

ఇదేం క్రూరత్వం? బెలూన్లతో కుక్కను గాలిలో ఎగరేసిన యూట్యూబర్

కొంతమంది ఫేమస్ అయిపోవడానికి అడ్డదారులు ఎంచుకుంటూ ఉంటారు. నిజానికి ట్యాలెంట్ ఉంటే జనాల ఆదరణ పొందుతారు. అంటే పరోక్షంగా వారు ఫేమస్ అవుతారు. కానీ ఫేమస్ అవడానికి ఏ దారీ దొరకని కొందరు మాత్రం పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబ్ చేసిన పని.. జంతు ప్రేమికులకు కోపం తెప్పింది. దాంతో అతడు కటకటాల పాలయ్యాడు.

ఢిల్లీకి చెందిన గౌరవ్ జాన్ అనే యూట్యూబ్ తన ఛానల్ కోసం అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు తన పెంపుడు కుక్కతో చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఢిల్లీలోని ఓ పార్కులో అతడు తన కుక్కకు హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగరేశాడు. ఆ కుక్క గాలిలో కొద్దిసేపు అలానే ఉండటం వీడియోలో కనిపించింది. దీనిని గమనించిన పీపుల్ ఫర్ యానిమల్ సభ్యులు ఢిల్లీలోని మాల్వియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జంతువును హింసించినందుకు గౌరవ్ తో పాటు అతడి తల్లిపై సెక్షన్ 188, 269, 34 కింద కేసు నమోదు చేశారు. గౌరవ్‎ను పోలీసులు అరెస్టు చేశారు.

https://www.youtube.com/watch?v=vVTXkyZFh10
Advertisement

తాజా వార్తలు

Advertisement