Sunday, May 19, 2024

IndvsAus | జోరుమీదున్న మ‌హిళ‌లు.. కంగారూలతో వ‌న్డే, టీ20 సిరీస్‌కు రెడీ

సొంతగడ్డపై వారం వ్యవధిలోనే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌తో జ‌రిగిన‌ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది టీమ్ఇండియా. ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డే భార‌త టీ20, వ‌న్డే జ‌ట్ల‌ను ఇవ్వాల (సోమ‌వారం) ప్ర‌క‌టించింది బీసీసీఐ. హర్మన్‌ ప్రీత్‌ కౌర్ నాయ‌క‌త్వంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. మూడు వ‌న్డేల సిరీస్ డిసెంబ‌ర్ 28 నుంచి ఆరంభం కానుండ‌గా, మూడు మ్యాచుల టీ20 సిరీస్ జ‌న‌వ‌రి 5 నుంచి ఆరంభం కానుంది.

వ‌న్డేల‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు :

హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్ ), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా ( వికెట్ కీపర్ ), రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ్‌ రాణా, హర్లీన్ డియోల్

టీ20ల‌కు భారత మహిళల జట్టు :

- Advertisement -

హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్ ), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా ( వికెట్ కీపర్ ), రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement