Tuesday, May 7, 2024

BB3 పరిస్థితేంటి? వాయిదా పడుతుందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా అనగానే మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడమే దీనికి కారణం. ఆ రెండు సినిమాలకి మించి ఇప్పుడు మూడో సినిమా ఉంటుందని బోయపాటి చెప్పిన దగ్గర నుంచి, బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మే 28న విడుదల చేస్తామనే ప్రకటన చేస్తూ పోస్టర్ వదిలిన తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. కరోనా వ్యాప్తి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల రిలీజ్ డేట్ వాయిదా వేసే ఉద్దేశంతోనే అప్ డేట్స్ ఇవ్వడం లేదనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవేళ అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చిత్ర బృందానికి ఉంటే ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశముంది. మరి బాలయ్య తన అభిమానులను హుషారెత్తిస్తారేమో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement