Friday, April 26, 2024

సంకీర్తనల ద్వారా తెలుగుభాషకు సొబగు నింపిన అన్నమయ్య – ఒంటేరు శ్రీనివాసులరెడ్డి


ప్రొద్దుటూరు – స్థానిక శ్రీ రాములు పేటలోని ఉపాధ్యాయ సేవాకేంద్రంలో అన్నమయ్య కళాపీఠం ఆధ్వర్యంలో
పద కవితా పితామహుడు,హరి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 518వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పీఠం గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివిసుల రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య 32వేల సంకీర్తనలు రచించగా అందులో మనకు 12 వేలు మాత్రమే లభ్యమయ్యాయి. అన్నమయ్య ఎక్కువగా అచ్చ తెలుగు పదాల కే ప్రాధాన్యతనిచ్చారు. వేటూరి ప్రభాకర శాస్త్రి,రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఈ సంకీర్తనలను పరిష్కరించి స్వరపరిచారన్నారు.కళాపీఠం అధ్యక్షులు ఎడవల్లి రమణయ్య భాగవతార్ ఈ సందర్భంగా రెండు అన్నమయ్యకున్న భక్తి భావాన్ని తెలిపే రెండు సంకీర్తనలను మధురంగా ఆలపించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషోపాధ్యాయ అధ్యక్షులు అంకాల్ కొండయ్య,ఎపిసిపియస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శీయపురెడ్డి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గజ్జెల వెంకటేశ్వర్ రెడ్డి, రాయలసీమ వ్యాయామ శిక్షణ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పంజగల మధుసూదన్ బాబు, డాక్టర్ కూరపాటి శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యాయులు ఎద్దుల రాయపురెడ్డి,బాలిసెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement