Saturday, May 4, 2024

మంత్రి జగదీశ్ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటాం.. కేటీఆర్

మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన మాటకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మునుగోడు డెవలప్ మెంట్ కు నిధులు కావాలన్నారు. ఒక్క సీటుతో వచ్చేది లేదు.. పోయేది లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రకృతి సమస్య కాద‌న్నారు. ఫ్లోరైడ్ పై సీఎం కేసీఆర్ స్వయంగా పాటలు రాశారన్నారు. 580 ఎకరాల్లో తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామికవాడ రాబోతోందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.

ఉత్తమ పంచాయతీల్లో టాప్ 19 తెలంగాణలో ఉన్నాయన్నారు. బండి సంజయ్ కు వచ్చిన పదవి తెలంగాణ పుణ్యమేనన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్నారు. అభివృద్ధిని నిధులు ఇవ్వ‌మంటే మోడీ ఇవ్వ‌డం లేద‌న్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా ఇదే మోడీ స్టైల్ అన్నారు. ఒక కాంట్రాక్టర్ బలుపు, అహంకారం వల్లనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మిషన్ భగీరథ పథకంతో నల్గొండ ఫ్లోరోసిస్ ను తరిమికొట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.. కోవర్టు రెడ్డిలు కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement