Friday, April 26, 2024

భారీ వ‌ర్షాల‌తో యూపీ అతలాకుతలం..

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. దీంతో జ‌నాలు భ‌య‌ట‌కు వ‌చ్చేందుకు జంకుతున్నారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది వ‌ర‌కు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లక్నో, నోయిడా, కాన్పూర్‌, ఆగ్రా, ఫిరోజాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 17 జిల్లాల్లో వంద‌లాది గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు. రోడ్డు దెబ్బ‌తిన్నాయి, పంట‌లు నీట మునిగాయి. ప‌లు ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement