Wednesday, May 8, 2024

High Speed ​​Rail Network | చైనా తరహా రైల్వేలు మనకూ కావాలి.. ఆర్ధిక వృద్ధిలో చాలా కీలకం

చైనాలో ప్రస్తుతం హై స్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా ఉంది. జపాన్‌, చైనా ఈ విషయంలో ఎంతో పురోగతిని సాధించాయి. మన దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఈ రెండు దేశాలతో పోటీలో నిలబడేందుకు ఈ తరహా హై స్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో ప్రధానంగా దక్షణాదిలో చెన్నయ్‌, బెంగళూర్‌ నగరాలు ఆర్ధిక కార్యకాలాపాల్లో ఎంతో కీలకమైనవిగా ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య దూరం 285 కి.మీ.లుగా ఉంది.

ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించేందుకు 4 గంటల 20 నిముషాల సమయం తీసుకుంటోంది. చైనాలోని రెండు ఆర్ధికంగా ముఖ్యమైన నగరాలైన బీజింగ్‌-షాంఘై మధ్య దూరం 1070 కిలోమీటర్లు. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని చైనా హై స్పీడ్‌ బులెట్‌ ట్రైన్‌ 4 గంటల్లోనే చేరుకుంటుంది.

చైనాలో 2008లో హై స్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ దేశంలో 41,843 కిలోమీటర్ల దూరం ఈ నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. చైనాలో బుల్లెట్‌ ట్రైన్‌ సగటు హై స్పీడ్‌ గంటకు 354 కి.మీ.గా ఉంది. మనదేశంలో ప్రస్తుతం హై స్పీడ్‌ రైలుగా వందేభారత్‌ ఉంది. ఈ ట్రైన్‌ వాస్తవ స్పీడ్‌ను మన దేశ రైల్వే నెట్‌వర్క్‌లో అందుకునే అవకాశం లేదు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న రైల్వే ట్రాక్స్‌ కనీసం గంటకు 130 కి.మీ స్పీడ్‌ను తట్టుకునేలా లేవు.

- Advertisement -

మన దేశంలో జపాన్‌ సహాయంతో చేపట్టిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. మొదటి బుల్లెట్‌ ట్రైన్‌ ముంబై- అహ్మదాబాద్‌ వరకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 5 గంటలకు పైగా పడుతోంది. దీన్ని మూడు గంటల లోపుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో బుల్లెట్‌ ట్రైన్‌ మార్గం నిర్మాణం 2026, ఆగస్టు వరుకు పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమయానికి చైనాలో బుల్లెట్‌ ట్రైన్‌ నెట్‌వర్క్‌ 48,280 కిలోమీటర్లకు పెరగనుంది.

స్థానిక రైలు ప్రయాణం గ్లోబల్‌ ఎగుమతులతో ఏమైనా సంబందం ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రముఖ ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్లు సింగపూర్‌లోని ఇన్‌సిడాలోని లిన్‌టిన్‌, టోరెంటో యూనివర్శిటిలో పని చేస్తున్న యూయు అనే ఇద్దరు ప్రముఖ ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్లు దీనికి సమాధానం ఇచ్చారు. వీరిద్దరూ 2008 నుంచి 2013 వరకు చైనా బుల్లెట్‌ ట్రైన్‌ వ్యవస్థ, దాని మూలంగా వచ్చిన ప్రయోజనాలపై జాగ్రత్తగా పరిశీలించారు. సంస్థ దేశీయ భౌగోళిక ఏకీకరణ, అంతర్జాతీయ మార్కెట్లను స్వీకరించడం మధ్య సంబంధం ఉంటుందా అనే ప్రశ్నకు వీరి విశ్లేషణ ప్రకారం బలమైన లింక్‌ ఉందని తేల్చారు.

ఒక ప్రమాణిక డివిజేషన్‌ సంస్థ ఎగుమతుల ఆదాయంలో 4 శాతం పెరుగుదలకు దారితీస్తుందని, ఎగుమతి చేసిన ఉత్పత్తుల యూనిట్‌ ధరలో 5 శాతం తగ్గింపు, ఎగుమతి పరిమాణంలో 9 శాతం పెరుగుదల నమోదు అవుతుందని తేల్చారు. ఒక విషయం ఒక్కడ స్పష్టమైందని, సంస్థలు ఎక్కువ ఎగుమతి చేయడమే కాదు, మెరుగ్గా ఎగుమతి చేస్తున్నాయని వీరు స్పష్టం చేశారు.

మన దేశంలో ఉన్న జాప్యం కారణంగా నాణ్యమైన మౌలిక సదుపాయలను పొందలేకపోతున్నాం. దీని వల్ల చైనాలో చేసిన విధంగా సరకులను ఎగుమతి చేయలేకపోతున్నాం. బెంగళూర్‌ వంటి ఐటీ నగరాలు అవుట్‌ సోర్సింగ్‌లో బాగా పని చేశాయి. ఎందుకంటే సేవల ఎగుమతులకు రోడ్లు, పోర్టులు అవసరంలేదు. చైనాలోనూ, జపాన్‌లోనూ హైస్పీడ్‌ రైళ్లు వచ్చిన తరువాత ఆర్ధిక రంగంలో వేగంవంతమైన వృద్ధి నమోదైంది. ఉత్పాదక పెరిగింది. ఆర్ధిక కార్యకలాపాలు శరవేగంగా విస్తరించాయి.

మిరట్‌-చెన్నయ్‌ మధ్య 1788 కి.మీ దూరాన్ని మన దేశంలో రైలు ప్రయాణానికి 39 గంటల సమయం తీసుకుంటోంది. అదే చైనాలో బీజింగ్‌-గ్యాంగ్జో నగరాల మధ్య దూరం 1890 కిలోమీటర్ల దూరాన్ని హై స్పీడ్‌ రైలు కేవలం 7.30 నిముషాల్లోనే చేరుకుంటుంది. ఇది ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా తోడ్పాటు అందిస్తోంది. మన దేశంలోనూ ఢిల్లిd నుంచి ముంబైకి, ఢిల్లి నుంచి ఇతర ఆర్ధిక కార్యకాపాలు జరిగే ముఖ్య నగరాలకు హై స్పీడ్‌ రైట్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement