Monday, December 9, 2024

గులాబీ జెండాకు మేమే ఓనర్లం: ఈటల

గులాబీ జెండాకు తామే ఓనర్లమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను పిలిపించి అడిగితే బాగుండేదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ… వారు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. తనపై వస్తున్న కట్టు కథలను చూస్తుంటే బాధ కలుగుతోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత పత్రిక, చానల్ లోనే తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసినా తాను బెదరనని స్పష్టం చేశారు. విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

కాగా, గులాబీ జెండాకు యజమానులం మేమే అంటూ మంత్రి ఈటల రాజేందర్ గతంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని నిన్న సీఎంకు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణకు కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement