Thursday, September 16, 2021

ఏపీలో యువత తీరుపై వైరల్ అవుతున్న పోస్ట్

ఏపీలో యువత తీరుపై డా.కొలికపూడి శ్రీనివాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ‘రాజధాని లేదన్న బాధ లేదు.. పరిశ్రమలు, ఉద్యోగాలు రావన్న దిగులు లేదు.. తల్లిదండ్రులు అప్పులు చేసి చదవిస్తుంటే.. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు సంపాదించి జీవితంలో ఎలా ఎదగాలి అన్న ధ్యాస లేదు… ఆంధ్రప్రదేశ్‌లో యువతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు, మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నారు.. అమ్మానాన్న జన్మినిచ్చారు.. అంబానీ జియో ఇచ్చాడు.. బతికేస్తున్నారు’ అంటూ ఉంది. ఈ పోస్ట్ ఏపీలోని యువత తీరుకు అద్దం పడుతోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News