Thursday, May 2, 2024

ఇంట్రెస్టింగ్ గా.. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ టీజ‌ర్

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రం నుండి టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రంలో హీరోగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది.ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చిత్రసీమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. అలాగే ఈ సినిమా కు శరత్‌ చంద్ర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌ లో కిరణ్ అబ్బవరం….దుమ్ములేపారు.టీజర్ ఎలా ఉందంటే ..నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేది నా కథ” అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పే మాటతో టీజర్ స్టార్ట్ అయ్యింది. టీజర్ అంతా హీరో వాయిస్ ఓవర్ మీద నడిచింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement