Thursday, April 25, 2024

ఎత్తుకు పై ఎత్తులు…కత్తుల్లా వ్యూహాలు…

మరోసారి విజయం కోసం కెసిఆర్ నిరంతరం కసరత్తు
పొత్తులతోనైనా అధికారమే లక్ష్యమంటున్న బిజెపి
వూహించని మలుపులు తిరుగుతున్న ఖమ్మం జిల్లా రాజకీయం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొన్ని విషయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. తమ భావజాలాన్ని పక్కనబెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పనిచేస్తునాయి. ఇది ఎన్నికల ఏడాది కావడంతో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అధినాయకులు పావులు కడుపుతున్నారు. ఒకరికి మించి మరొకరు పైచేయి సాధించేలా వ్యూహాలను రచిస్తునారు. ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ బలంగా ఉంటుందని వాస్తవాలు చెబుతున్నప్పటికీ అధికారం మాత్రం బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ఈసారి విజయం సాధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అదే సమయంలో అధికారాన్ని వదులుకోవద్దన్న గట్టి పట్టుదలతో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మద్య నువ్వా నేనా అన్నట్లు-గా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసిఆర్‌ గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారని గత కొన్నాళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెబుతున్నాయి.

అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదని, ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని కేసిఆర్‌ చాలాసార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. కేసిఆర్‌ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్నాటక ఎన్నికలతో పాటు- తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించే ఉందని ఇటీవల కాంగ్రెస్‌ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మరోసారి ఈ ముందస్తు ఎన్నికల చర్చ తెలంగాణలో రాజకీయ వేడిని పెంచుతోంది. అయితె, ముందస్తు ఎన్నికలు తప్పవని బీజేపీ శ్రేణులు చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేసిఆర్‌ రాజకీయ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కని విధంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలు ఒకటి అనుకుంటే, తాను మరోటి అమలు చేసి ఇరుకున పెట్టడం కేసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నది అందరికీ తెలిసిందే. విపక్షాలను డిఫెన్స్‌ లో పడేసేందుకే కేసిఆర్‌ అలా చెబుతున్నారని, అసలు రహస్య వ్యూహం ముందస్తు ఎన్నికలేనని కాషాయ దళం గట్టి వాదనను వినిపిస్తోంది. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నమంటూ ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలు ముందుకు కదులుతున్నాయి. సంచలన నిర్ణయాలకు మారు పేరుగా ఉన్న కేసిఆర్‌ గతంలో మాదిరిగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారన్న వాదనకు కొంత బలం చేకూరుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్‌లు చోటు- చేసుకుంటు-న్నాయి. ముందునుంచీ ఈ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు ఇక్కడి నేతలకు గాలం వేసేందుకు బీజేపీ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తమ పట్టును- నిలుపుకోవాలని చూస్తుండగా, వైఎస్‌ షర్మిల సైతం ఖమ్మంలోని పాలేరులో పోటీ-కి రెడీ అని చెబుతోంది. ఇటీ-వల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో రీ ఎంట్రీ- ఇచ్చి, ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడి నాయకత్వానికి కొత్త ఊపు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో రకరకాల సమీకరణాలు కొనసాగు తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈయనతో పాటు- కొందరు నేతలు బీఆర్‌ఎస్‌ వీడి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానిక నేతలు. జిల్లాలో మరో కీలకమైన నేత,- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ రాజకీయంగా తమ బలాన్ని పెంచుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న నాయకులను ఎలాగైనా బయటకు లాగాలని ప్లాన్‌ చేస్తుంది. ఇలా రాజకీయం నడుస్తుండగానే ఈ నెల 18న పొంగులేటి అమిత్‌ షాతో కలిసి బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు- అదే తేదీన కేసీఆర్‌ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇక ఆ రోజు కేసీఆర్‌తో పాటు- ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అలాగే జిల్లాలో టీ-డీపీ కూడా యాక్టివ్‌ గానే పనిచేస్తోంది. అక్కడ దూకుడుగా ముందుకెళ్ళేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం ఖమ్మంపైనే ఫోకస్‌ పెట్టారు. ఆ జిల్లాలోని పాలేరు స్థానం నుంచి పోటీ- చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఖమ్మంలో రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement