Saturday, May 4, 2024

ఉత్తుత్తి రాజీనామాలతో “గంట” మోగిస్తున్నారు

విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతోంది. కార్మికుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా కూడా చేశారు. అయితే, నేరుగా పేరెత్తకుండా.. పరోక్షంగా ట్విటర్‌లో గంటాను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు “గంటలు” కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో  సొంత “గంట” మోగిస్తున్నారు. ఆ “గంట”లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ “గంట” శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో “భూగంట” మోగించలేదా?’’ అంటూ ట్వీట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement