Thursday, May 16, 2024

‘అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం’ – రిలీజ్ డేట్ ఫిక్స్

విద్యాసాగ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం. ఈ చిత్రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాని నిర్మించారు. జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా రుక్షర్ థిల్లోన్ నటించగా, మరో కథానాయియికగా రితిక నాయక్ కనిపించనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కారణంగా అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ కథ ఇటు టౌన్ లోను .. అటు విలేజ్ లోను నడుస్తుంది.హీరో పెళ్లి చూపుల కోసం అమ్మాయి వాళ్ల ఊరు రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు చాలామందే కనిపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement