Monday, April 29, 2024

శ‌శిథ‌రూర్ ఫ‌న్నీ ట్వీట్ – కేర‌ళని ఎలా రాయాలో తెలుసా

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్. ఇంగ్లీష్ పై ఆయ‌న‌కి ప‌ట్టుబాగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. చాలామందికి తెలియని ఆంగ్ల పదాలను, అత్యంత క్లిష్టమైన స్పెల్లింగులతో ఉండే పదాలను కూడా ఆయన తన వ్యాఖ్యల్లో ఉపయోగిస్తుంటారు. శశిథరూర్ కేరళ‌కి చెందిన వారు. అలాంటి వ్యక్తి తన సొంత రాష్ట్రం పేరును ఎవరైనా తప్పుగా రాస్తే ఎలా భరించగలరా.. అందుకే ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నారు. “హిందీ మాట్లాడే కొందరు సోదరులకు విజ్ఞప్తి. దీన్ని Kerala (కేరళ) అని రాయాలి. Karela (కాకరకాయ) అని కాదు. అంతేకాకుండా, మేం పొట్ల, కాకర, సొరకాయల (Gourd) సామ్రాజ్యానికి చెందినవాళ్లం కాద‌ని చమత్కరించారు. ప్రకృతి అందాల దృష్ట్యా కేరళను God’s own country (దేవుడి సొంత దేశం)గా భావిస్తుంటారు. ఈ అంశాన్ని కూడా శశిథరూర్ తన ట్వీట్ లో వ్యంగ్యం ఉట్టిపడేలా ప్రస్తావించారు. అయితే కేరళను కరేలా అన్నది ఎవరో ఆయన వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement