Sunday, May 5, 2024

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్ సీడీపీని రిలీజ్ చేయ‌నున్న వ‌రుణ్ తేజ్

మార్చి 27వ తేదీన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. నేటి నుంచే అందుకు సంబంధించిన సంబరాలకు మెగా అభిమానులు తెర తీయనున్నారు. వారి కోసం చరణ్ బర్త్ డే స్పెషల్ సీడీపీని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు, వరుణ్ తేజ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితం పోస్టర్ ను వదిలారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని సినిమాతో చరణ్ బిజీగా ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాతో బిజీగా ఉన్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తూ ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement