Friday, April 26, 2024

ఎన్టీఆర్ 30 మూవీకి రాజ‌మౌళి క్లాప్

ఎన్టిఆర్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండి యా సినిమా హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ఈ సినిమా గ్రాండ్‌ లెవల్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టిఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కార్యక్రమానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళితో పాటు ప్రశాంత్‌ నీల్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, ఏషియన్‌ సునీల్‌, అభిషేక్‌ నామా, అభిషేక్‌ అగర్వాల్‌, భరత్‌ చౌదరి, జాన్వీ కపూర్‌, ప్రకాష్‌ రాజ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఎన్టిఆర్‌, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరిం చిన ముహూర్తపు సన్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి క్లాప్‌ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ గౌరవ దర్శకత్వం వహంచారు. ప్రము ఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి స్క్రప్ట్‌ను అందించా రు.
ఈ సందర్భంగా.. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ”ఎన్టిఆ ర్‌తో జనతాగ్యారేజ్‌ తర్వాత పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ జెనరేషన్‌ బెస్ట్‌ యాక్టర్‌ ఎన్టి ఆర్‌. సినిమా ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌ లో సెట్‌ అయిన కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగా లు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగా లుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. ఈ సినిమా నా బెస్ట్‌ అవుతుం దని అందరికీ ప్రామిస్‌ చేస్తున్నా. ” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ , ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ,సినిమాటోగ్రపీ రత్నవేలు తదితరులు మాట్లాడా రు. ఈ చిత్రాన్ని తెలుగు, #హందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 5, 2024న రిలీజ్‌ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement