Tuesday, April 30, 2024

భారత్‌ జి20 ప్రెసిడెన్సీకి అమెరికా మద్దతు.. జైశంకర్‌, బ్లింకెన్‌ కంబోడియాలో చర్చలు

భారత జి20 అధ్యక్ష పదవికి అమెరికా మద్దతిస్తోందని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ ట్వీట్‌ చేశారు. భారతదేశం డిసెంబర్‌ 1న శక్తివంతమైన గ్రూపు అధ్యక్ష పదవిని చేపట్టనుంది. విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మరియు అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌ ఆదివారం కంబోడియాలో జరిగిన అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం మరియు ద్వైపాక్షిక సంబంధాలతో సహా పలు అంశాలపై చర్చించారు. బ్లింకెన్‌ భారతదేశం యొక్క జి20 అధ్యక్ష పదవికి కూడా మద్దతు ఇచ్చినట్లు జైశంకర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా బ్లింకెన్‌ మాట్లాడుతూ, ”మా భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం యొక్క ప్రభావాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను చర్చించడానికి ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశం అంచున భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ను కలిసినట్లు చెప్పారు. భారతదేశం యొక్క జి20 ప్రెసిడెన్సీకి యూఎస్‌ మద్దతు ఇస్తుందన్నారు. యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో మంచి సమావేశం. ఉక్రెయిన్‌, ఇండో-పసిఫిక్‌, ఎనర్జీ, జి20 మరియు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు’ అని జైశంకర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జి20 లేదా గ్రూప్‌ ఆఫ్‌ 20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్‌ ప్రభుత్వ ఫోరమ్‌. ఇది చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, రష్యా, సౌదీ అరేబియా, యూరోపియన్‌ యూనియన్‌ వంటి దేశాలు ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం జి20 ప్రెసిడెన్సీ లోగో, వెబ్‌సైట్‌ మరియు థీమ్‌ను ఆవిష్కరించారు. దీని ఇతివృత్తం ”వసుధైవ కుటుంబం” లేదా ”ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు” మహా ఉపనిషత్తు యొక్క ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement