Wednesday, May 8, 2024

అమెరికా ఆపన్న హస్తం, ఉక్రెయిన్‌కు 13.6 బి.డాలర్ల సాయం..

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 13.6 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌ కూడా ఆమోదం తెలిపింది. తన బలగాలను ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు తరలించేందుకు ఈ నిధులను ఉపయోగించనుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రకటించారు. రష్యా సైనిక దాడుల్లో తీవ్రంగా దెబ్బతినన ఉక్రెయిన్‌కు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా.. 50 మిలియన్‌ డాలర్లను మానవతా సాయం కింద అందిస్తున్నట్టు కమలా తెలిపారు.

ఇప్పటికే రొమేనియా ఆర్థిక సాయంతో పాటు వివిధ రక్షణ పరికరాలను అందించింది. బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, యూకే వంటి దేశాలు ఫైటర్‌ జెట్స్‌, యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు అందించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement