Sunday, April 28, 2024

సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా?: బండి

ప్రభుత్వ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి ధాన్యం అంతా వాన పాలు అవుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రతి ఏటా ఇట్లాంటి సమస్యలే వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం మేల్కొనడం లేదని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుండటంతో రైతులు వారాల తరబడి కల్లంలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్లాన్ సిద్ధం చేసుకోలేదని సంజయ్ విమర్శించారు. ఎంత ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా వ్యవసాయ శాఖలో లేకపోవడం దారుణం అని, కనీసం సరపడ గన్నీ బ్యాగులు కూడా లేవని మండిపడ్డారు. ఈ సీజన్ లో అకాల వర్షాలు సర్వసాధారణం అని, కానీ కల్లాల్లో సరిపడ టార్పాలిన్ లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టార్పాలిన్లు లేకపోవడంతో రైతుల ధాన్యం అంతా వర్షానికి కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే ఆ రైతుల ఏడుపులు ఈ సీఎంకు వినిపించలేదా అని సంజయ్ నిలదీశారు.

దేశ ప్రజలంతా కరోనాతో వణికి పోతుంటే తెలంగాణ రైతు ఆ కరోనాతో సహవాసం చేస్తూ కల్లాలు, మార్కెట్లో వారాల తరబడి బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. ఆరుగాలం పడ్డ కష్టం ఒక్క వానతో తడిసిపోయిందన్న ఆవేదనతోనే రైతులు చినిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాలు పేరుతో రైతుల్ని నిలువు దోపిడి చేస్తుంటే వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఏఈఓలు సర్టిఫై చేశాక కూడా మిల్లర్లు కిలీల చొప్పున తాలును కట్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 6,477 కోనుగోలు కేంద్రాలు పెట్టామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన తెలంగాణ సర్కార్.. కనీసం 5 వేల కేంద్రాలు కూడా పెట్టలేదని గుర్తు చేశారు.  వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి వర్షసుచన ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. సరిపడ టార్పాలిన్లు, గన్నీబ్యాగులు సమకూర్చాలన్నారు. 24 గంటల పాటు కాంటాలు పెట్టి కల్లాల నుంచి ధాన్యాన్ని మిల్లులలకు చేరవేయాలని సంజయ్ సూచించారు.

ఇదీ చదవండి : కరోనా బాధితుల కోసం 2డీజీ డ్రగ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement