Tuesday, March 26, 2024

1 మిలియన్ వ్యూస్ సాధించిన సందీప్ కిషన్ రొమాంటిక్ సాంగ్

సందీప్ కిషన్ హీరోగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం గల్లీ రౌడీ. ఈ సినిమాలో బాబి సింహ, హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ,పోసాని కృష్ణ మురళి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ను ఎంవీవి సినిమా కార్పొరేషన్ బ్యానర్నాపై అ సత్యనారాయణ కోనవెంకట్ నిర్మించారు. అయితే సాయి కార్తీక్ రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇప్పటికే గల్లీ రౌడీ నుంచి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఓ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను మిరియాల రామ్ పాడగా భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. అయితే తాజాగా ఈ సాంగ్ వన్ మిలియన్ న్యూస్ ను సొంతం చేసుకుంది.కాగా వన్ వీక్ నుంచి ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ వన్ లో ట్రెండ్ కావడం విశేషం.

https://youtu.be/txjK_4EtQ5A
Advertisement

తాజా వార్తలు

Advertisement