Sunday, May 12, 2024

కరోనా బాధితుల కోసం 2డీజీ డ్రగ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

కరోనా బాధితుల కోసం భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ తయారు చేసిన 2 డీజీ డ్రగ్ అందుబాటులోకి రాబోతోంది. కొవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆవిష్కరించింది. ఇప్పటికే రకరకాల ట్రయల్స్​ పూర్తి చేసుకున్న ఈ మందు వారంలో మార్కెట్​లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ ను విడుదల చేసింది. 10 వేల సాచెట్​లు మొదటి బ్యాచ్‌ ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పొడి రూపంలో డ్రగ్‌ను నీళ్లలో క‌లుపుకొని తాగితే వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్‌ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. 2-డీజీ ఔష‌ధ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమ‌తి ఇచ్చింది.

ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీఓ పేర్కొంది. జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్పత్తి చాలా సులువ‌ని తెలిపింది. దీన్ని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగెటివ్‌గా తేలిన‌ట్లు డీఆర్‌డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

2 డీజీ నీళ్లలో కలుపుకొని తాగే పౌడర్ ​కాబట్టి తీసుకోవడం తేలిక. ఈ డ్రగ్​ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడ్రోజుల్లోనే తేడా కనిపించిందని నిపుణులు అంటున్నారు. ‘ఒక పేషెంట్​5 రోజులు హాస్పిటల్​లో ఉండాల్సి వస్తే, 2 డీజీ తీసుకుంటే అది రెండు, మూడు రోజులకు తగ్గుతుంది’ అని డీఆర్డీవో డైరెక్టర్​సతీశ్​రెడ్డి తెలిపారు. అన్ని వయసుల వారికీ ఇది పనిచేస్తుందన్నారు. తమ ట్రయల్స్ లో 65 నుంచి 75 ఏళ్ల వాళ్లలోనూ మంచి ఫలితం కనిపించిందని చెప్పారు. 

https://twitter.com/DRDO_India/status/1390961209776623618

ఇది కూడా చదవండి : కేంద్రం కీలక నిర్ణయం.. మరిన్ని కంపెనీలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములా

Advertisement

తాజా వార్తలు

Advertisement