Thursday, March 28, 2024

ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హవా

తెలుగు ఇండస్ట్రీ లో కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుంది. ముఖ్యంగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి గురించి చెప్పాలి. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు… నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించింది. తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతులు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

మరోవైపు కేతిక శర్మ గురించి చెప్పాలి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. కానీ ఈ అమ్మడు చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. కేతిక ప్రస్తుతం నాగశౌర్యతో నటిస్తూనే…వైష్ణవ్ తేజ్ తో కూడా అవకాశం పొందింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఈ ఇద్దరూ మంచి జోష్ మీద ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement