Saturday, April 27, 2024

బాల‌కృష్ణ‌.. చిరంజీవిల‌తో సినిమా.. ఆహాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర‌వింద్

అన్ స్టాప‌బుల్2 ఎపిసోడ్5 ప్రోమోని రిలీజ్ చేసింది ఆహా.. 90 సంవత్సరాల తెలుగు సినిమా కీర్తి.. యుగ పురుషుడి (ఎన్టీఆర్‌)కి శత జయంతి నివాళి..ఈ అద్భుతమైన ఎపిసోడ్‌ని మిస్ అవ్వకండి అంటూ విడుదల చేసిన ప్రోమో బాలకృష్ణ సరదా చిట్‌చాట్‌తో అభిమానులకు పసందైన వినోదాన్ని పంచుతుంది.

తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టినవాళ్లు, సినిమానే ప్రపంచంగా పెరిగినవాళ్లు మన నిర్మాతలు.. ది స్టాల్ వార్ట్స్ ఆఫ్‌ తెలుగు సినిమా అంటూ ముందుగా నిర్మాత‌లు సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌..ఆ తర్వాత రాఘవేంద్రరావుని స్టేజీపైకి ఆహ్వానించారు బాలకృష్ణ. మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్ అని బాలకృష్ణ అంటుండగా.. మీ (బాలకృష్ణ)తో, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా చేయాలని వెయిట్‌ చేస్తున్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అల్లు అరవింద్‌.కామెంట్స్ తో మరి రానున్న రోజుల్లో అల్లు అరవింద్‌-చిరు-బాలయ్య కాంబోలో సినిమా రావడం గ్యారంటీ అని తెగ పండగ చేస్కుకుంటున్నారు అభిమానులు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement