Monday, May 6, 2024

ఇంటింటా నిరుద్యోగం..న్యూ ఇండియా నినాదమిదే : రాహుల్‌

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ఈసారి ట్విట్టర్‌ వేదికగా నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. దేశంలోని యువతకు మోడీ ఇచ్చిన మాస్టర్‌స్ట్రోక్‌ కారణంగా నిరుద్యోగులు ఆశలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. మోడీ ఇచ్చిన అనేక మాస్టర్‌స్ట్రోక్స్‌తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల అన్వేషణను విరమించుకున్నారని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ ఘనత వహంచిన మొట్ట మొదటి ప్రధాని మోడీయే అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఇంట్లో ఓ నిరుద్యోగి.. ఇంటింటా నిరుద్యోగం.. మోడీ చెబుతున్న న్యూ ఇండియా నినాదమిదే అంటూ రాహుల్‌ వరుస ట్వీట్లు చేశారు. గత ఐదేళ్లలో 2.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 45 కోట్ల మంది ఉద్యోగాల కోసం ప్రయత్నించడమే మానేశారనే వార్తాకథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement