Sunday, May 26, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశివారికి ఎలా ఉంటుందంటే..

కుంభ రాశి
ఆదాయం 14, వ్యయం – 14
రాజ్య పూజ్యం 06, అవమానం – 01

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగాలలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. 02.05.2024 నుండి 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 1వ స్థానమై అశుభుడైనందున బంధుమిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement