Saturday, June 1, 2024

KHM: రోడ్డుప్ర‌మాదం… ఒక‌రు మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

బూర్గంపాడు, మే 26 (ప్రభ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం కిన్నెరసాని బ్రిడ్జిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న శెట్టిపల్లి నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు కనితి హర్షవర్ధన్ తీవ్ర గాయాలతో హాస్పటల్లో వైద్యం పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా, ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జ‌య్యింది. బుర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement