Sunday, May 19, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశివారికి ఎలా ఉంటుందంటే..

మీన రాశి
ఆదాయం 11 వ్యయం 05
రాజ్య పూజ్యం – 02, అవమానం – 04

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. 02.05.2024 వరకు 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుక్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూరవ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు సాధారణ శుభుడైనందున విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement