Saturday, June 1, 2024

Chiller : బికినీ వ్యాపారంలో చిల్ల‌ర్

చాలామంది క‌థానాయిక‌లు ఫ్యాష‌న్ రంగంలో రాణిస్తున్నారు. సోన‌మ్ క‌పూర్, స‌మంత, నేహా శ‌ర్మ‌ లాంటి భామ‌లు ఇప్ప‌టికే దుస్తుల వ్యాపారంలో ఉన్నారు. ఇక క‌త్రిన, న‌య‌న‌తార‌, స‌న్నీలియోన్, తాప్సీ లాంటి న‌టీమ‌ణులు సొంత బ్రాండ్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వ్యాపారంలో మునిగి తేల్తున్నారు. అయితే వీళ్లంద‌రి కంటే భిన్నంగా ఈ బ్యూటీ ఈత దుస్తులు, బికినీల వ్యాపారంలోకి దిగింది. మా దుకాణంలో బికినీలు, స్విమ్ సూట్లు అమ్మ‌బ‌డును!! అంటూ బోర్డ్ పెట్టుకుంది.

- Advertisement -

ఇంత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి .. మాజీ ప్ర‌పంచ సుంద‌రి మానుషి చిల్లర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌ల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ మానుషి సినీరంగంలో అత్యంత అన్ ల‌క్కీ గాళ్. న‌టించే అవ‌కాశం రావ‌డానికే త‌న‌కు కొన్నేళ్లు ప‌ట్టింది. ఆ త‌ర్వాత రెండు మూడు సినిమాలు చేయ‌డానికి కొన్నేళ్ల స‌మ‌యం వృధా అయింది. కానీ తాను న‌టించిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లే కావ‌డంతో ఎంతో డీలా ప‌డిపోయింది.

ఇక మానుషి ఫ్యాషన్ ప్ర‌పంచంలో లాభ సాటి వ్యాపారాల వైపు దృష్టి సారిస్తోంద‌ని తెలిసింది. ఇప్పుడు ఒక వ్యవస్థాపకురాలిగా మారుతోంది. మాజీ మిస్ వరల్డ్ మానుషి ఈత దుస్తుల బ్రాండ్ ‘డ్వీప్‌’ను ప్రారంభించింది. ఇటీవల ఇంటర్నెట్‌లో వేడెక్కించే బికినీ- స్విమ్ సూట్ల‌తో క‌నిపించింది మానుషి. మనుషి చిల్లర్ ఆక్వా రెడ్ బికినిలో కనిపించి మ‌తులు చెడగొట్టింది. ఇందులో హాల్టర్ నెక్ కోవ్ డబుల్-లేయర్ టై బికినీ బాటమ్స్ తో మ‌తిచెడ‌గొట్టింది. తన బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేస్తూనే ఒక చేతికి బ్రాస్‌లెట్ ధ‌రించి క‌నిపించింది. ర‌క‌ర‌కాల రంగుల్లో ఉన్న బికినీల‌ను మానుషి ధ‌రించింది. తాజాగా మానుషి షేర్ చేసిన‌ వీడియో క్లిప్ లో ఒక నియాన్ బికినీ.. రెడ్ హాట్ బికినీలో మ‌తులు చెడ‌గొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement