Sunday, June 16, 2024

TS : భక్తజనంతో పోటెత్తిన రాజన్న ఆలయం … రూ. 40 లక్షల ఆదాయం

వేములవాడ, ఆంధ్రప్రభ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక ,ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని 33 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి తరలివచ్చారు.

తెల్లవారుజామున పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు సుమారు నాలుగు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని 50 వేల మంది భక్తులు దర్శించుకోగా ఆలయానికి 40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిల్లు ఏర్పాటు, తాగునీటి పంపిణీ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement