Sunday, May 19, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశివారికి ఎలా ఉంటుందంటే..

మకర రాశి
ఆధాయం 14 వ్యయం 14
రాజ్య పూజ్యం 03, అవమానం – 01
గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు. 02.05.2024 నుండి 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 2వ స్థానమై శుభుడైనందున కుటుంబకలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు మేషరాశి 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్ని వస్తుంది. ప్రయాణాలుంటాయి. 31.10.2024 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement