Sunday, May 19, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి ఎలా ఉంటుందంటే..

వృశ్చిక రాశి
ఆదాయం – 08, వ్యయం – 14
రాజ్య పూజ్యం – 04, అవమానం – 05
గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది. 02.05.2024 నుండి 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 4వ స్థానమై అశుభడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు.

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement