Wednesday, May 22, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులా రాశివారికి ఎలా ఉంటుందంటే..

తుల రాశి
ఆదాయం 02, వ్యయం – 08
రాజ్య పూజ్యం 01, అవమానం-05

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. 02.05.2024 నుండి 8వ స్థానమై అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 5వ స్థానమై అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు

Advertisement

తాజా వార్తలు

Advertisement