Saturday, May 18, 2024

Ugadi Panchangam |శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్య రాశివారికి ఎలా ఉంటుందంటే..

కన్యా రాశి
ఆదాయం – 05, వ్యయం – 05
రాజ్య పూజ్యం – 05, అవమానం – 02

గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 8వ స్థానమై అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు. 02.05.2024 నుండి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 6వ స్థానమై శుభుడైనందున బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement