Friday, May 3, 2024

విమానంలో ప్రయాణికుడిపై టైసన్‌ పిడిగుద్దులు

బాక్సింగ్‌ యోధుడు, మాజీ ప్రపంచ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. అదేపనిగా మాట్లాడుతూ విసిగెత్తించడంతో చిర్రెత్తిన టైసన్‌ ఒక్కదుటన లేచి పిడిగుద్దులతో చెలరేగిపోయాడు. ఫ్లోరిడాకు చెందిన జెట్‌బ్లూ విమానం గురువారంనాడు శాన్‌ఫ్రాన్‌సిస్కోనుంచి బయలుదేరేముందు ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానంలో తన సీట్లో కూర్చున్న టైసన్‌ వెనుక వరుసలో ఉన్న వ్యక్తి పదేపదే మాట్లాడుతూండటంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటంతో టైసన్‌ లేచి పిడిగుద్దులు కురిపించాడు. కొద్ది సెకన్ల తరువాత విమానం దిగి వెళ్లిపోయాడు. ఆ ప్రయాణికుడు పూర్తి మత్తులో ఉంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తించడవల్లే ఇలా జరిగిందని టైసన్‌ సన్నిహితులు ప్రకటించారు. కాగా ఈ దాడి జరిగినప్పుడు బాధితుడి బంధువులు టైసన్‌కు కన్పించకుండా వీడియోలో రికార్డు చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement