Tuesday, March 19, 2024

ఆకాశంలో అద్బుతం.. కనువిందు చేయనున్న ఉల్కాపాతం, ఢిల్లీ, కోల్‌కతాల్లో స్పష్టంగా చూడొచ్చు

ఆకాశంలో ఉల్కల వర్షం కురియనుంది. ఈ అద్బుతమైన దృశ్యం భారత గగనతలంలో శనివారం రాత్రి కనువిందు చేయనుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్న ధాచర్‌ తోకచుక్క ధూళిమేఘంలోంచి దూసుకొచ్చే ఈ ఉల్కలు ఏటా ఒకసారి ఇలా భూమిపైకి దూసుకువస్తూ మండిపోవడం మామూలే. సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి వైపు వచ్చినపుడు ఈ పరిణామం సంభవిస్తూ ఉంటుంది. శనివారం నుండి ఈనెల 29 వరకు రోజూ రాత్రిపూట ఈ ఉల్కల రాలడాన్ని దేశంలోని ప్రధాన నగరాలనుంచి వీక్షించొచ్చు. అయితే పున్నమి వెన్నెల పరచుకుంటే ఉల్కలను స్పష్టంగా చూసే వీలుండదు. ఈ రోజుల్లో రాత్రి 8.31 సమయంలో ఉల్కలు రాలడాన్ని స్పష్టంగా చూడొచ్చు. వెన్నెల, మేఘాలు అలుముకోకపోతే తెల్లవారుఝామున మరింత స్పష్టంగా కన్పిస్తాయి. చిన్నచిన్న చుక్కల్లా, పొడవైన రేఖల్లా ప్రతి గంటకు ఒక్కో దఫాలో పదినుంచి వందల సంఖ్యలో ఉల్కలు మండుతూ నేలరాలతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ లిరిడ్‌ ఉల్కాపాతం దాదాపు 2700 సంవత్సరాలుగా ఏటా సంభవిస్తోందని నాసా భావిస్తోంది. అంతరిక్షంలోని లైరా నక్షత్రకూటమికి సంకేతంగా ఈ ఉల్కలకు లిరిడ్‌ అని పేరుపెట్టారు. సూర్యుని చుట్టూ తిరగడానికి థాటర్‌ తోకచుక్కకు 415 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం సౌరమండలంనుంచి దూరంగా వెడుతున్న ఈ తోకచుక్క 45 ఏళ్ల తరువాత మళ్లిd వెనక్కు వస్తుంది. ఈ పరిభ్రమణ సమయంలో దాని తోకలోని ధూళి మేఘంనుంచి భూమిపైకి దూసుకొస్తూ మండిపోయే ద్రవ్యరాశినే ఉల్కలుగా చెబుతారు. మన దేశంలో ఈనెల 29వరకే ఈ ఉల్కాపాతాన్ని వీక్షించగలం. కానీ భూమిపై దాదాపు మూడు నెలలపాటు ఈ ఉల్కాపాతం ఉంటుంది. అయితే వేరే ప్రాంతాల్లొ ఇది కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement