Saturday, May 4, 2024

Big Breaking | హైదరాబాద్​లో మళ్లీ మొదలైన వాన.. మెయిన్ ​రూట్లలో ట్రాఫిక్​ జామ్​

రెండ్రోజులపాటు గెరువిచ్చిన వాన హైదరాబాద్​లో మళ్లీ మొదలయ్యింది. ఆదివారం సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్​తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, హైదరాబాద్​లోని కూకట్​పల్లి, బాలానగర్​, నిజాంపేట్​, అమీర్​పేట్​, జూబ్లీహిల్స్​, హైటెక్​సిటీ, బంజారాహిల్స్​, అత్తాపూర్​, బండ్లగూడ జాగీర్​, చార్మినార్​ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్​లోని మెయిన్​రూట్లలో ట్రాఫిక్​ నెమ్మదిగా సాగుతోంది. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement