Monday, May 6, 2024

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన వ్యామోగాములు..

ముగ్గురు రష్యన్‌ వ్యోమగాములు ఉక్రెయిన్‌ జాతీయ జెండా రంగులతో కూడిన ఫ్లైట్‌ సూట్‌లు ధరించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. కజకిస్తాన్‌ నుంచి సూయజ్‌ ఎస్‌ఎస్‌21 స్పేస్‌ క్రాఫ్ట్‌లో వీరు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత అంతరిక్ష కేంద్రం చేరుకున్న మొదటి వ్యక్తులు వీరే.

ఈ ముగ్గురు పసుపురంగు యూనిఫారమ్‌ ధరించారు. దీనిపై వారు స్పందిస్తూ, ఎవరికివారు సొంత సూట్‌లు ఎంచుకుంటారు. యాదృచ్చికంగా మేం ముగ్గురు ఒకే రంగుఎంచుకున్నాం అని అర్టెమేవ్‌, డెనిస్‌ మట్వెయేవ్‌, సెర్గీ కోర్సాకోవ్‌ వివరించారు. ప్రస్తుతం ఇద్దరు రష్యన్లు, నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్‌ కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో సభ్యులుగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement