Friday, April 26, 2024

తోప్ టీవీ యాప్ నిర్వాహకుడు అరెస్ట్

ఓటీటీల కంటెంట్‌ను కాపీ చేస్తున్న తోప్ టీవీ యాప్ నిర్వాహకుడు సతీష్ వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, నెట్‌ప్లిక్స్, ఆహా లాంటి పలు ఓటీటీలకు సంబంధించిన కంటెంట్‌ను కాపీ కొడుతూ తోప్ టీవీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుండగా.. పలు ఓటీటీలు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో తోప్ టీవీ యాప్ నిర్వాహకుడు సతీష్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా నిందితుడు సతీష్ వెంకటేశ్వర్లు ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తుండటం గమనార్హం.

ఈ వార్త కూడా చదవండి: జెఫ్ బేజోస్ అంతరిక్ష యాత్రకు రంగం సిద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement