Wednesday, April 24, 2024

జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు రంగం సిద్దం..

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు రూట్ క్లీయర్ అయింది. జెఫ్ బెజోస్ అమెరికా అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్ కు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా వచ్చే మంగళవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర ప్రారంభం కానుంది. ఇక బ్లూ ఆరిజన్ సంస్థకు ఇదే తొలి అంతరిక్ష యాత్ర కావడం గమనార్హం. న్యూ షెపర్డ్ వ్యోమనౌక భూమి నుంచి 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. మళ్లీ వినియోగించగలిగే సామర్థ్యం ఉన్న బూస్టర్ ద్వారా ఈ వ్యోమనౌకను రోదసీలోకి పంపుతారు. తిరుగు ప్రయాణంలో పారాచూట్ సాయంతో ఎడారిలో ల్యాండ్ అవుతుంది.

జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82 ఏళ్ల ఏవియేషన్ నిపుణురాలు, వేలంలో 2.8 కోట్ల డాలర్లకు టికెట్ దక్కించుకున్న మరో వ్యక్తి రోదసీలోకి వెళ్లనున్నారు. కాగా, ఆదివారం వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక అంతరిక్ష యాత్రకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చింది. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, గుంటూరు మూలాలున్న తెలుగు యువతి బండ్ల శిరీషతోపాటు మరో నలుగురు రోదసీలోకి వెళ్లారు. యూనిటీ అంతరిక్ష నౌక భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి రోదసీగా భావించే కర్మాన్ రేఖను దాటి రాగా, న్యూషెపర్డ్ 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుండడం గమనార్హం. కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కూడా త్వరలోనే అంతరిక్ష యాత్ర చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇక పై జాబ్ క్యాలెండర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement