Thursday, May 2, 2024

రేపు ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.!

రేపు ఓటీటీలో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ప‌లు అగ్ర‌హీరోలు న‌టించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే!

ZEE5:

Vikranth Rona – September 2
కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన కన్నడ చిత్రం విక్రాంత్ రోణ సెప్టెంబ‌ర్ 2న జీ5 ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశానికి గ్రాఫిక్స్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. జూలై 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైన విక్రాంత్ రోణ రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే తెలుగు, హిందీ వెర్ష‌న్స్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

Khuda Haafiz: Chapter 2 – September 2
ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ యాక్షన్-డ్రామా మూవీ. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఖుదా హాఫీజ్ చాప్టర్ II: అగ్ని పరీక్ష ఒక చిన్న అమ్మాయి నందిని గురించి, నందిని తప్పిపోయినప్పుడు సమీర్, నర్గీస్‌లకు విషయాలు సంక్లిష్టంగా మారాయి.

My Dear Bootham – September 2
ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మై డియ‌ర్ భూతం చిత్రం సెప్టెంబ‌ర్ 2నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఫాంట‌సీ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

- Advertisement -

Aha:

Degala Babji – September 2
బండ్ల గణేష్ ఏక పాత్రలో నటించిన డేగల బాబ్జీ చిత్రం సెప్టెంబర్ 2న ఆహా ఓటీటీలో విడుదలకాబోతున్నది. ఒత్త సెరప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వెంకటచంద్ర దర్శకత్వం వహించాడు.

Wanted Pandugadu -September 2
సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన వాంటెడ్ పండుగాడ్ చిత్రం సెప్టెంబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్, సుడిగాలి సుధీర్, బ్రహ్మానందం, అనసూయ, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించాడు.

Disney plus hotstar:

Cuttputlli – September 2
ఈ ఏడాది బాలీవుడ్ అగ్రహీరో అక్ష‌య్ కుమార్‌కు ల‌క్ అంత‌గా క‌లిసి రాలేదు. అత‌డు హీరోగా న‌టించిన పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్ సినిమాలు డిజాస్ట‌ర్స్ గా మిగిలాయి. ఈ పరాజయాల ప్రభావంతో తాజా చిత్రం క‌ట్ పుట్లీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కాబోతుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన రాక్ష‌సుడు సినిమా ఆధారంగా సైకో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రంజిత్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది.

Amazon Prime:

The Lord of the Rings: Rings of Power

Sonyliv:

Sundari Gardens – September 2

Netflix:

Buy My House – September 2

Dated and Related – September 2

Devil in Ohio – September 2

Fakes – September 2

You’re Nothing Special – September 2

Kaatteri – September 2

Advertisement

తాజా వార్తలు

Advertisement