Thursday, April 18, 2024

వంద మిలియన్లు.. ప్రయాణికుల చేరవేతలలో రైల్వే రికార్డ్‌

హైదరాబాద్‌ : రికార్డుల విషయంలో ఎక్స్‌ప్రెస్‌ మాదిరిగా దూసుకుపోతోన్న దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌)… తాజాగా మరో రికార్డును సాధించింది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే… అంటే ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్య 100.7 మిలియన్ల మంది ప్రయాణనికులు దమరై రీజియన్‌లో ప్రయాణించారు. కాగా.. కిందటి నెల (ఆగస్టు)లో గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయం నమోదు కావడం విశేషం. ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలొరి ఆగస్టు నెలలో.. 422.33 కోట్ల ఆదాయాన్ని పొందడం గమనార్హం. గతతంలో ఎన్నడూ లేనిరీతిలో.. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆదాయాన్ని ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మే నెలలో దక్షిణ మధ్య రైల్వే.. అత్యుత్తమ ఆదాయాన్ని నమోదు చేసుకోగా, ఈ ఆర్ధికసంవత్సరంలోనే ఆగస్టు నెలలో రెండవ అత్యుత్తమ ఆదాయాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం. జోన్‌ ప్రయాణికుల విషయానికొస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి ఆగస్టు వరకురూ. 2,039.33 కోట్ల ఆదాయాన్ని దమరై నమోదు చేసింది.

కాగా.. ప్రత్యేక రైళ్ళ నిర్వహణ కూడా అధికాదాయానికి దోహదం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెగ్యులర్‌ రైళ్ళకు జోడించిన 1,089 అదనపు బోగీలు కూడా అధికాదాయాన్ని సమకూర్చుకోవడంతో తోడ్పడ్డాయని అధికారులు వివరించారు. కాగా.. ఈ నెల (సెప్టెంబరు) మొదలుకుని డిసెంబరు వరకు పెద్దసంఖ్యలో ప్రత్యేకరైళ్ళను నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఇతర రీజియన్లకన్నా దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రయాణికుల రద్దీ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఎప్పటికప్పుడు ప్రత్యేకరైళ్ళ నిర్వహణను కూడా పెంచుతూ వస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కార్గో రవాణాలో కూడా దక్షిణ మధ్య రైల్వే రికార్డును సృష్టించింది. కిందటి ఆర్ధికసంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెలలతో పోల్చుకుంటే.. ఈ ఏడాది అదే కాలంలో.. కార్గో రవాణాలో 20 శాతం అధికంగా కార్గో రవాణా నమోదైనట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement