Wednesday, May 8, 2024

ఈ వారం థియేట‌ర్..ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఇవే

ఈ వారం థియేట‌ర్..ఓటీటీల‌లో పలు చిత్రాలు సంద‌డి చేయ‌నున్నాయి. చిన్న హీరోల చిత్రాలు ఈ వారం థియేట‌ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు. సిద్ధి ఇద్నానీ, రాధిక, సిద్ధిఖ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంగీతం ఏఆర్‌ రెహమాన్‌ అందించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌ జంటగా నటించిన చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. శ్రీధర్‌గాదె దర్శకుడు. సంగీతం మణిశర్మ సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సంగీతం వివేక్‌ సాగర్‌ అందించారు. ఇది కూడా శుక్రవారం ప్రేక్షకులను అలరించనుంది. సుదీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్‌ కీలకపాత్రల్లో నటించిన శాకినీ డాకినీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకుర రానుంది. మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకుడు.
సుదీప్‌, మడోనా సెబాస్టియన్‌, అఫ్తాబ్‌, రవిశంకర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు నటించిన కోటికొక్కడు ఈ శుక్రవారం విడుదల కానుంది. వీజే సన్నీ హీరోగా సకల.. గుణాభిరామ ఈ శుక్రవారం అలరించనుంది.దర్శకత్వం వెలిగొండ శ్రీనివాస్ చేశారు. నేను కేరాఫ్‌ నువ్వు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మూవీస్ ఇవే..

సెప్టెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్ లో విరుమన్‌ (తమిళ చిత్రం)..డిస్నీ+హాట్‌స్టార్ లో సెప్టెంబరు 16న విక్రాంత్‌ రోణ (తెలుగు)..
దహన్‌ (హిందీ సిరీస్‌)..సెప్టెంబరు 16న నెట్‌ఫ్లిక్స్ లో జోగి (హిందీ)చిత్రం.. సెప్టెంబరు15న సోనీలివ్ లో రామారావు ఆన్‌ డ్యూటీ (తెలుగు)..కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ సిరిస్‌-3) స్ట్రీమింగ్ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement