Tuesday, April 30, 2024

సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి.. ఈ వారంలో రిలీజ్ అయ్యే మూవీస్​ ఏంటంటే..

వేసవిలో సినిమాల సందడి తర్వాత.. గ‌త‌ జులై పూర్తిగా నిరాశపరిచింది. రిలీజ్ అయ్యే సినిమాలై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న మూవీ ల‌వ‌ర్స్.. జులైలో రిలీజ్ అయిన సినిమాలు అంత‌గా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాయి అనే అంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలో నండ‌మూరి హీరో కల్యాణ్ రామ్ న‌టించిన సోషియో ఫాంట‌సీ మూవీ బింబిసారా ఉంది. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ జోన‌ర్ లో క‌ల్యాణ్ రామ్ చేయ‌డం ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి.. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

దీంతో పాటు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం సీతా రామం. ఈ సినిమాలో మృణాళిని ఠాకూర్‌ కథానాయిక క‌నిపించ‌నుంది. అంతే కాకుండా రష్మిక, త‌రుణ్ బాస్క‌ర్ కీలకపాత్రలో క‌నింపించనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వ‌హించిన‌ ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement