Tuesday, May 7, 2024

మురుగు కాలువ‌లో అప్పుడే పుట్టిన శిశువు… ఆడపిల్లగా పుట్టడమే ఆ పసికందు చేసిన పాపమా..!!

ఆడపిల్ల పుట్టిందనే కారణమో.. భారాన్ని తగ్గించుకుందామనో తెలియదు కానీ అప్పుడే పుట్టిన పసికందును మురుగు కాలువలో పడేశారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. ఈ విషాధ‌క‌ర‌మైన ఘ‌ట‌న బాపట్ల జిల్లా చీరాల జక్కావారి వీధిలో చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. అప్పుడే పుట్టిన ఆడ శిశువుని మురుగు కాలువలో పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇది గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కాలువలో నుంచి శిశువును బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆడ శిశువు అయినందునే కాలువలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి వివ‌రాల‌ను పోలీసులు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement