Tuesday, May 14, 2024

ఎన్టీఆర్ కి అవార్డ్ ఇస్తాం.. హెచ్ సిఏ ప్ర‌క‌ట‌న‌

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆర్ ఆర్ ఆర్ మానియా న‌డుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ద‌ర్శ‌కుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రభంజనం ఆగడం లేదు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకలో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, రాంచరణ్, కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ హాజరయ్యారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్ కి హెచ్ సి ఏ లో స్పాట్ లైట్ అవార్డు దక్కింది. హెచ్ సి ఏ వేడుకలో మొత్తం రాంచరణ్ హంగామా కనిపించింది. చరణ్ ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక వర్గం హెచ్ సి ఏ అవార్డ్స్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. హెచ్ సి ఏ సంస్థ స్టార్ హీరో ఎన్టీఆర్ ని గౌరవించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. . ఈ నేపథ్యంలో హెచ్సీఏ స్పందించింది. . ఎన్టీఆర్ ని తాము ముందే ఆహ్వానించాం అని.. సినిమా కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు మరణించడం జరిగింది అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఎన్టీఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం త్వరలో యుఎస్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు హెచ్ సీఏ అవార్డు అందుకునే అవకాశం ఉంది.దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement